విష్వక్సేనుడి వారసులుగా భక్తులకు భద్రత - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

విష్వక్సేనుడి వారసులుగా భక్తులకు భద్రత

భద్రత కల్పించండి

రవికిరణాలు(సెల్వం-తిరుమల)విష్వక్సేనుడి వారసులుగా భక్తులకు భద్రత కల్పించండిటిటిడి సివిఎస్‌వో ఎకె.రవికృష్ణ  శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడి వారసులుగా టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది భక్తులకు మెరుగైన భద్రత కల్పించాలని టిటిడి ముఖ్య నిఘా భద్రతాధికారి ఎకె.రవికృష్ణ కోరారు. తిరుమలలోని పిఏసి-4లో గల సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో టిటిడి భద్రతా సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సివిఎస్‌వో మాట్లాడుతూ తిరుపతి, తిరుమలలో మూడంచెల భద్రతా వ్యవస్థపై అవగాహన కల్పించారు. పాత నేరస్తులను, సంఘ విద్రోహశక్తులను, అనధికార హాకర్లను, దళారులను అలిపిరి చెక్‌పాయింట్‌ వద్దనే గుర్తించేందుకు వీలుగా ఫేస్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌తో కూడిన సిసి కెమెరాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు . తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను మరింత ఆధునీకరించి సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇస్తామన్నారు. తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో గల సిసి కెమెరాలను సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేసి నిత్యం పర్యవేక్షిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విజిఓలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి, ఎవిఎస్‌వోలు శ్రీ కూర్మారావు, శ్రీ నందీశ్వరరావు, శ్రీ రామచంద్రయ్య, శ్రీ చిరంజీవి, శ్రీ శ్రీనాథరెడ్డి పాల్గొన్నారు.

కల్పించండి

టిటిడి సివిఎస్‌వో ఎకె.రవికృష్ణ

శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడి వారసులుగా టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది భక్తులకు మెరుగైన భద్రత కల్పించాలని టిటిడి ముఖ్య నిఘా భద్రతాధికారి ఎకె.రవికృష్ణ కోరారు. తిరుమలలోని పిఏసి-4లో గల సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో టిటిడి భద్రతా సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సివిఎస్‌వో మాట్లాడుతూ తిరుపతి, తిరుమలలో మూడంచెల భద్రతా వ్యవస్థపై అవగాహన కల్పించారు. పాత నేరస్తులను, సంఘ విద్రోహశక్తులను, అనధికార హాకర్లను, దళారులను అలిపిరి చెక్‌పాయింట్‌ వద్దనే గుర్తించేందుకు వీలుగా ఫేస్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌తో కూడిన సిసి కెమెరాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు . తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను మరింత ఆధునీకరించి సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇస్తామన్నారు. తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో గల సిసి కెమెరాలను సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేసి నిత్యం పర్యవేక్షిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విజిఓలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి, ఎవిఎస్‌వోలు శ్రీ కూర్మారావు, శ్రీ నందీశ్వరరావు, శ్రీ రామచంద్రయ్య, శ్రీ చిరంజీవి, శ్రీ శ్రీనాథరెడ్డి పాల్గొన్నారు.
విష్వక్సేనుడి వారసులుగా భక్తులకు భద్రత Reviewed by CHANDRA BABU on July 27, 2017 Rating: 5   భద్రత కల్పించండి రవికిరణాలు(సెల్వం-తిరుమల)విష్వక్సేనుడి వారసులుగా భక్తులకు భద్రత కల్పించండిటిటిడి సివిఎస్‌వో ఎకె.రవికృష్ణ  శ్రీవారి సర్వసై...

No comments: