రవికిరణాలు(తిరుమల) : రోడ్డు సేఫ్టీ మీద అనంతపురం రేంజ్ డి.ఐ.జి. జే.ప్రభాకర్ రావు, అర్బన్ జిల్లా యస్.పి అభిషేక్ మొహంతి ఆధ్వర్యంలో అర్బన్ జిల్లాలోని ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి చెక్ పోస్ట్ పాయింట్ల్ నందు సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేస్తూవుండాలని, జాతీయ రహదారులవెంట, ముఖ్యమైన సర్కిల్లో, రోడ్ల నందు తప్పకుండా బెరిగేట్స్ ఏర్పాటు చేయాలనీ తెలిపారు. అలాగే ప్రతీ బెరిగేట్స్ కి అందరికి కనబదేవిధంగా రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలనీ, గుబురుగా వుండే ప్రదేశాలు, టర్నింగ్స్ పాయింట్లను గుర్తించి విధిగా రేడియం స్టిక్కర్లుతో కూడిన బెరిగేట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కువగా ప్రమాదాలు జరుగు ప్రదేశాలను గుర్తించి అక్కడ స్పీడ్ కంట్రోల్ స్పీడ్ బ్రేకర్, సి.సి. కెమరాలను ఏర్పాటు చేయాలన్నారు. అంబులన్స్, హైవే మొబైల్స్ లలో జి.పి.ఆర్.యస్. సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలనీ అలాగే కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ ను రోడ్ సేఫ్టీ కు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఆటోలు, షేర్ ఆటోలు నేషనల్ హైవే మీద తిరగడం నిషేదించాలని, ఓవర్ లోడ్ లను కూడా కంట్రోల్ చేయాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ ఆక్సిడెంట్ చేసిన వారిపై కేసు నమోదు చేయాలని, అలాగే డ్రైవింగ్ సీట్ పక్కన ప్రయాణీకులను కూర్చోనియ్యకుండా అదుపు చేయాలని అనంతపూరం రేంజ్ డి.ఐ.జి సూచించారు.కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ బలోపితం చేసుకొని, ఏ.పి.పి. లోతో ప్రతిరోజు కేసులు గురించి మాట్లాడి ముద్దాయిలకు శిక్ష పడే విధంగా చూసుకోవాలని, అలాగే గర్ల్ మిస్సింగ్ కిడ్నాప్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కేసు నమోదు అయినప్పుడు అలసత్వం చేయకుండా వెంటనే కేసు నమోదు చేయాలనీ,
పక్కరాష్ట్రాల పోలీస్ అధికారులతో కూడా తస్-సంబంధాలు ఏర్పాటుచేసుకోని, కేసుని ముందుకు నడిపించాలని తెలియచేసారు.ఈ సమావేశంలో జిల్లాలోని అడిషనల్ యస్.పి.లు, డి.యస్.పి.లు, సి.ఐ.లు యస్.ఐ.లు పాల్గొన్నారు.
పక్కరాష్ట్రాల పోలీస్ అధికారులతో కూడా తస్-సంబంధాలు ఏర్పాటుచేసుకోని, కేసుని ముందుకు నడిపించాలని తెలియచేసారు.ఈ సమావేశంలో జిల్లాలోని అడిషనల్ యస్.పి.లు, డి.యస్.పి.లు, సి.ఐ.లు యస్.ఐ.లు పాల్గొన్నారు.
No comments: