రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - బద్రీ) :ముద్రగడ హౌస్ అరెస్ట్ కు నిరసనగా కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో బలిజ సంగీయులు తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జెఏసీ నాయకులు బద్రి మాట్లాడుతూ కాపు బలిజ లు టీడీపి ప్రభుత్వానికి శత్రువులు కారు, అలాగే ఇతర పార్టీలలో సభ్యత్వాలు లేవు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకే అడుగుతున్నామన్నారు. బలిజల కోసం ముద్రగడ పద్మనాభం నిరంతరం తన జాతి కోసం ప్రాణాలు అర్పించడానికేనా సిద్ధమే అన్నారు. అలాంటి నాయకుని ఏపీలో ఉన్నా ప్రతి బలిజ సంగీయుడు సంగీబావం తెలపాలని, ఆయన అడుగు జాడలలో నడవాలని, ఆయన కోసం ఎలాంటి త్యాగాలకైయిన సిద్ధం కావాలన్నారు. రాబోయే రోజులలో కర్నూలు జిల్లా నుండి ప్రతి బలిజ సంగీయులు ముద్రగడ అడుగు జాడలో నాడుస్తామన్నారు. అలాగే ప్రతి రోజు ముద్రగడకి మద్దతుగా కర్నూలు జిల్లాలో ఉన్న ప్రతి కాపు బలిజలు కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెఏసీ నాయకులు భాస్కర్, శివరాం, మదయ్య, పెద్ద పుల్లయ్య, మదిలేటి, కోవెలకుంట్ల కిట్టు, సుబ్బారాయుడు, పుల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కాపు బలిజలను వెంటనే బీసీలుగా ప్రకటించాలి
కాపు బలిజలను వెంటనే బీసీలుగా ప్రకటించాలి
Reviewed by CHANDRA BABU
on
July 31, 2017
Rating: 5
రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - బద్రీ) :ముద్రగడ హౌస్ అరెస్ట్ కు నిరసనగా కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో బలిజ సంగీయులు తహసిల్దార్ కు వినతి పత్రం ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: