రవికిరణాలు(సూళ్లూరుపేట) : క్రికెట్... క్రీడా ప్రపంచంలో అత్యధికులు అభిమానించే సూపర్ గేమ్. మారుమూల పల్లె నుంచి మహానగరాల వరకు క్రికెట్ అంటే ఆశక్తి ఉన్నవారు కోకొల్లలు కనిపిస్తారు. కానీ మైదానంలో ఆడే అవకాశం మాత్రం కొందరికే వస్తుంది. అందునా ప్రపంచానికి తెలిసిన వివిధ దేశాల క్రికెటర్లతో ఆడే ఛాన్స్ చాలా కొద్దిమందికే వస్తుంది. అలాంటి అరుదైన అవకాశాన్ని దక్కిచ్చుకున్నాడు మన ఆంధ్రా కుర్రాడు. ఆ కుర్రాడు ఎవరో.. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి...భారీ మైదానం, రెండు జట్లు, జట్టుకు 11మంది క్రీడాకారులు. క్రీడాకారుల్లో అంతర్జాతీయ క్రికెటర్లు. వారితో పాటు మన ఆంధ్రాకు చెందిన ఓ యువకుడు. వింటుంటేనే ఆహా అనిపించేలా ఉంది కదూ. ఇప్పటివరకు మన ఆంధ్రా నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడేందుకు వెళ్లిన వారిని వేళ్లలో లెక్కపెట్టవచ్చు. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న యువకుడు ఇంటర్‌నేషనల్ క్రికెట్ టీమ్‌కి సెలక్ట్ కాలేదు కానీ మార్షిష్ ట్రోఫి పుణ్యమా అని అంతర్జాతీయ క్రికెటర్లతో మైదానాన్ని పంచుకున్నాడు. తన క్రీడా ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట మండలం కేసీఎన్ గుంట గ్రామానికి చెందిన ఇతని పేరు శ్రీహరికోట మస్తాన్ . నిరుపేద కుటుంబంలో పుట్టిన మస్తాన్ చిన్నతనం నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా క్రికెట్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకోకపోయినా.... పాఠశాల, కళాశాల స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. బీటెక్ పూర్తిచేసిన తర్వాత శ్రీసిటీలో ఉద్యోగంలో చేరారు. మస్తాన్‌లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి ఓ మిత్రుడు సాయం చేయడంతో.. బెంగళూరు క్రికెట్ అకాడమీలో చేరారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ అకాడమీలో క్రికెట్ శిక్షణ పొందుతున్నారు. అకాడమీలో శిక్షణ ఇచ్చే కోచ్‌లు మస్తాన్‌లో ప్రతిభను గుర్తించి మార్షిస్ ట్రోఫీకి ఎంపికచేశారు. అంతర్జాతీయ క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడడం చాలా సంతోషంగా ఉందని మస్తాన్ తెలిపారు. భవిష్యత్తులో
మంచి క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగం చేస్తూ సాధన చేయడం కష్టంగా ఉందన్న
మస్తాన్ స్పాన్సర్లు ముందుకొచ్చి తన శిక్షణకు సహకరించాలని కోరారు.
మంచి క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగం చేస్తూ సాధన చేయడం కష్టంగా ఉందన్న
మస్తాన్ స్పాన్సర్లు ముందుకొచ్చి తన శిక్షణకు సహకరించాలని కోరారు.
No comments: