రవికిరణాలు(శ్రీసిటీ) : చెన్నై-వైజాగ్ పారిశ్రామిక కారిడార్లో భాగమైన శ్రీసిటీకి జిల్లాలోని పలు ప్రధాన రోడ్డు మార్గాలను
అనుసంధానం చేస్తుంది. వాటిని నాలుగు, ఆరు లేన్ల రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. కొన్ని రోడ్లకు ఇప్పటికే నిధులు మంజూరు జరిగిందన్నారు. శ్రీసిటీలో ఫైర్ స్టేషన్ ప్రారంభోత్సవం అనంతరం శుక్రవారం మధ్యాహ్నం బిజినెస్ సెంటర్లో ఏర్పాటైన శ్రీసిటీ పరిశ్రమల సీఈఓల సమావేశంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు లేవనెత్తిన పలు సమస్యలు, కోర్కెలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. శ్రీసిటీ నుంచి తిరుపతి ఎయిర్ పోర్ట్ వరకు ప్రతిపాదిత 4 లేన్ల రోడ్డు పూర్తయితే 45 నిముషాల్లో శ్రీసిటీ నుంచి విమానాశ్రయానికి చేరవచ్చన్నారు. చెరివి విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో మరో నూతన 220 కెవి సబ్ స్టేషన్ నిర్మాణానికి 10 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయిస్తానని చెప్పారు. పెప్సీ పరిశ్రమ సమీపములోని చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టడం ద్వారా ఎక్కువ నీరు నిల్వ చేసుకునే సౌకర్యం కలుగచేస్తామన్నారు. ఈ ఎస్ ఐ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీసిటీ సమీపంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయింపు చేస్తామన్నారు. సత్యవేడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను అప్ గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. శ్రీసిటీలో సామాజిక మౌళిక వసతులు అభివృద్ధిలో భాగంగా బ్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్, మరో రెండు స్కూల్స్ యాజమాన్యాలతో చర్చిస్తానన్నారు. మీతో పాటు ఇంకా చాలా మందిని పరిశ్రమల ఏర్పాటుకు శ్రీసిటీకి, జిల్లాకు తీసుకురండంటూ ఈ సందర్భంగా సీఈఓలకు పిలుపునిచ్చారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడూతూ శ్రీసిటీలో ఇండస్ట్రియల్ ఎకో సిస్టం బాగా అభివృద్ధి జరిగందని, ప్రస్తుతం సోషల్ ఎకో సిస్టం అభివృద్ధిపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పోస్ట్ ఆఫీస్, ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్ ఏర్పాటు జరిగిందన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు సహకరిస్తేనే పూర్తి స్థాయిలో సోషల్ ఎకో సిస్టం అభివృద్ధి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="2566,2565,2564,2563"]

No comments: