గరుడ వాహనంపై మలయప్ప స్వామి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

గరుడ వాహనంపై మలయప్ప స్వామి

రవికిరణాలు(సెల్వం-తిరుమల) : గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి తిరుమలలో శ్రీమలయప్ప స్వామి గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7.00 నుండి 9.00 గంటల నడుమ గరుడవాహనసేవ మంగలవాయిద్యాల,కోలాటాల,చెక్కభజనల నడుమ కోలాహలంగా జరిగింది. శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తుంది టీటీడీ. కనుక ''గరుడ పంచమి'' పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితంఆనందదాయకంగా ఉండాలని,అలాగే తమకు పుట్టే సంతానం గరుడి వలే, బలశాలిగా ఎదగాలని స్త్రీలు ఆ దేవుణ్ణి కొలుస్తారు.టీటీడీ నిర్వహించిన గరుడ వాహనసేవలో టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గరుడ వాహనంపై మలయప్ప స్వామి Reviewed by CHANDRA BABU on July 28, 2017 Rating: 5 రవికిరణాలు(సెల్వం-తిరుమల) : గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి తిరుమలలో శ్రీమలయప్ప స్వామి గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరే...

No comments: