పోలీసులకు దిమ్మతిరిగేలా ముద్రగడ ఏర్పాట్లు!రవికిరణాలు(కిర్లంపూడి): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. ఆయన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించగా.. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర కొనసాగించి తీరాలని ముద్రగడ భావిస్తున్నారు. ఇటు ప్రభుత్వం, అటు ముద్రగడ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలో క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది.
బుధవారం నుంచి పాదయాత్ర చేపట్టేందుకు సన్నద్ధమవుతున్న ముద్రగద పద్మనాభం పోలీసులకు దిమ్మతిరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కిర్లంపూడిలోని తన నివాసం చుట్టూ హైడెఫినేషన్ వర్చువల్ రియాలిటీ సామర్థ్యం కలిగిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఈ ఏర్పాట్లు చేశారు. పోలీసులు హింసాత్మక చర్యలకు దిగితే రికార్డు చేసేందుకు ముందుజాగ్రత్తగా వీటిని నెలకొల్పారు. మరోవైపు ముద్రగడ ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. అడుగడుగునా పహారా కాస్తున్నారు. దీంతో ముద్రగడ పాదయాత్రపై చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగించడంతో కాపు నేతలు మండిపడుతున్నారు.

No comments: