రవికిరణాలు(రిపోర్టర్ - ఎస్ ఖలీల్ బాష) : కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు శ్రీ శ్రీ ఖాజా సయ్యద్ షా బాబా ఫరీద్ 52వ జయంతి నిర్వహించారు. బాబా ఫరీద్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీరాల దొడ్డి సమీపంలోని బాబా ఫరీద్ దర్గాలో రక్తదానం శిబిరం నిర్వహించారు. ఇందులో యూత్ సభ్యులు 90 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకులు సయ్యద్ ఖాదర్ బాబా, సయ్యద్ సర్ఫర్రాజ్ బాబా మాట్లాడుతూ సమాజాసేవలో భాగంగా రక్తదానం కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని లక్ష్యంతో యూత్ సభ్యులు రక్తదానం చేసారని అన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ డాక్టర్, శివారెడ్డి, దొరబాబు, సురేష్, అశోక్ సొసైటీ అధ్యక్షుడు సలీం, సభ్యులు సాదిక్, జహీర్, ఇమ్రాన్, సోమ్ శేఖర్, రాజు,గౌస్,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు.
[gallery td_select_gallery_slide="slide" ids="2253,2252"]
[gallery td_select_gallery_slide="slide" ids="2253,2252"]
No comments: