రవికిరణాలు(తూర్పుగోదావరి) : తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాపు ఉద్యమ సెగ తగిలింది. ముద్రగడ చేయాలని తలపెట్టిన పాదయాత్రకు భారీ స్పందన లభించింది. రాజకీయ నేతలతో పాటు మహిళలు, యువత, వివిధ గ్రామల ప్రజలు జై కాపు అంటూ రొడ్డెక్కారు. ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యమకారులను అడ్డుకున్నారు. పెద్దాపురం కాపు జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ మలకల చంటి బాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు. కడియంలో కాపు నేతలు పాదయాత్ర చేపట్టగా వందల సంఖ్యలో యువత అనుసరించే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. పాదయాత్రలో కాపునేతల రావిపాటి రామచంద్రరావు, గిరాజాల బాబు, గట్టి నర్సయ్య, కొత్తూరి బాలనాగేశ్వర రావు, కొత్తపల్లి మూర్తి, సాపిరెడ్డి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ముద్రగడ పాదయాత్రను అడ్డుకున్నందుకు నిరసనగా వేలంకలో యువకులు ఆందోళన చేపట్టారు. గుంటూరు జిల్లా నగరపాలక పోలీసు స్టేషన్‌లో కాపు జేఏసీ నాయకులు నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కాపులు పాదయాత్రని అడ్డుకోవడం వలన అందరూ నిరసన చేపట్టాలని కాపు జేఏసి నేతలు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి, ఏసుదాసు పిలుపునిచ్చారు.
[gallery td_select_gallery_slide="slide" ids="2336,2337,2338,2339,2340,2341,2342,2343,2344,2345,2346"]
[gallery td_select_gallery_slide="slide" ids="2336,2337,2338,2339,2340,2341,2342,2343,2344,2345,2346"]
No comments: