మరో కిడ్నాప్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

మరో కిడ్నాప్

రవికిరణాలు(తిరుమల రిపోర్టర్ - సెల్వం) : తిరుమలలో ఒక కిడ్నాప్ కథ సుఖాతం కాకముందే మరో కిడ్నప్ కేసు నమోదయింది. శ్రీకాళహస్తికి చెందిన సురేష్ తన 7ఏళ్ల కుమార్తె కనిపించడంలేదని 1వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో పిఏసి 4 వద్ద ఆడుకుంటున్న పాప అదృశ్యమైందని తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పాప అచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించగా అందులో ఒక మహిళతో పాప ఉన్నట్లు పోలీసులు గుర్తించి వెంటనే అన్ని ప్రాంతాల పోలీసుల వారిని అప్రమత్తం చేశారు. రాత్రి నుంచి అన్ని ప్రాంతాల్లో విజిలెన్స్ సిబ్బంది పూర్తిస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. సాధ్యమైనంత త్వరగా పాప ఆచూకీ తెలుసుకుని తల్లి వద్దకు చేరుస్తామని సీవీఎస్వో రవికృష్ణ తెలిపారు.
మరో కిడ్నాప్ Reviewed by CHANDRA BABU on July 25, 2017 Rating: 5 రవికిరణాలు(తిరుమల రిపోర్టర్ - సెల్వం) : తిరుమలలో ఒక కిడ్నాప్ కథ సుఖాతం కాకముందే మరో కిడ్నప్ కేసు నమోదయింది. శ్రీకాళహస్తికి చెందిన సురేష్ తన ...

No comments: