టోకెన్ విధానం సూపర్ : జెఇవో - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

టోకెన్ విధానం సూపర్ : జెఇవో

రవికిరణాలు(తిరుమల రిపోర్టర్ - సెల్వం) : టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో స్థానిక అన్నమయ్య భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. బిడ్డలతో తిరుమలకు వచ్చే తల్లితండ్రులు అప్రమత్తంగా వుండాలని చంటి పిల్లలను వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని...టీటీడీ, పోలీస్ సూచనలను పాటించాలని టీటీడీ జెఇవో శ్రీనివాసరాజు విజ్ఞప్తి చేసారు. అనంతరం జెఇవో మీడియాతో మాట్లాడుతూ నందిని కిడ్నప్ వ్యవహారంలో తల్లిదండ్రుల నిర్లక్ష్య౦ స్పష్టంగా కనపడుతుందన్నారు. కిడ్నపర్ పాపను వెల్లూరుకు తీసుకెళ్లినట్లు సిసి టీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించామన్నారు. టీటీడీ తరుపున పోలీసులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని త్వరలోనే చిన్నారిని పట్టుకుంటామన్నారు. గదుల కేటాయింపు విధానంలో తెచ్చిన నూతన విధానం విజయవంతమైందని భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండానే త్వరగతిన గదులను పొందుతున్నారు. నడకదారి టోకెన్ల జారీలో తెచ్చిన టైం స్లాట్ విధానం మంచి ఫలితాలను ఇస్తావుందని నడకమార్గాన వచ్చిన భక్తుడు కేవలం గంటలోనే స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటీకే లక్షన్నర మంది భక్తులు దివ్యదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారని జెఇవో చెప్పారు. శ్రీవారి ఆలయంలో క్యూ లైన్లలో తెచ్చిన మార్పులు సత్ఫలితాలను ఇస్తావుందని ఎటువంటి తోపులాటలు లేకుండానే భక్తులు శ్రీవారిని సంతృప్తికరంగా దర్శించుకుంటున్నారని జెఇవో తెలిపారు. ఆగష్టు 3 నుంచి 5 వరకు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. 2వ తేదీన పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తామని పవిత్రోత్సవాలలో భాగంగా మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నామని జెఇవో శ్రీనివాసరాజు చెప్పారు.
టోకెన్ విధానం సూపర్ : జెఇవో Reviewed by CHANDRA BABU on July 25, 2017 Rating: 5 రవికిరణాలు(తిరుమల రిపోర్టర్ - సెల్వం) : టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో స్థానిక అన్నమయ్య భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. బిడ్డలతో ...

No comments: