రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ మధు) : వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోలవరం నిధులు బూడిదపాలు చేశారంటూ తెదేపా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఆరోపించారు. పోలవరం పనులు రాష్ట్రానికి ఎందుకు అప్పగించారంటూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలపై బీదా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేని పనులు ఇప్పుడు చేస్తుంటే ఓర్చుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి కోట్ల రూపాయలు దోచుకున్న జగన్ పోలవరం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆరోపించారు. పోలవరం నిర్మాణాన్ని అడ్డుకునేందుకే వైకాపా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే పాశం సునీల్ ఆరోపించారు.
https://www.youtube.com/watch?v=kxrhJ1Xu0dI
https://www.youtube.com/watch?v=PpUahbqWhUo
https://www.youtube.com/watch?v=kxrhJ1Xu0dI
https://www.youtube.com/watch?v=PpUahbqWhUo
No comments: