రవికిరణాలు(పశ్చిమగోదావరి) : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జిల్లా పరిషత్ వసతి గృహంలో ఏపీ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రామానుజయ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం పాదయాత్ర విరమించుకోవాలని అన్నారు. చంద్రబాబు నాయుడు కాపు కార్పొరేషన్ పెట్టి కాపులకు ఎంతో మేలు చేసారన్నారు. ఎంతోమంది కాపు విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారని తెలిపారు. ఈసమావేశానికి ఏలూరు ఏం.ఎల్ ఏ.బడేటి బుజ్జి, హస్త కళా ఛైర్మన్ పాలి.ప్రసాద్, అఖిల భారత కాపు సమాఖ్య నాయకులు కే.లక్ష్మీపతి, అడపా మాళవిక, చలమలశెట్టి నరసింహారావు పాల్గొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="2224,2223,2222,2221,2220"]
[gallery td_select_gallery_slide="slide" ids="2224,2223,2222,2221,2220"]
No comments: