రవికిరణాలు(చిత్తూరు): చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో జడ్పీ నిధులతో చేప్టటిన పలు అభివృద్ధి పనులను ప్రజా పరిషత్ ఛైర్ పర్శన్ ఎస్. గీర్వాణి చంద్రప్రకాష్ ప్రారంభించారు. సాంతంబాకం, ఉగ్రానం పల్లిలో నూతనంగా నిర్మించిన అంగన్ వాడి కేంద్ర భవనాన్ని ఆమె ప్రారంభించారు. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేశారు. చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందించారు.
అనంతరం జెట్టిగుండ్లపల్లి హరిజనవాడలో సీసీ రోడ్డును ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ - హరికృష్ణ, మాజీ ఎమ్మెల్యే జి.కుతూహలమ్మ, జడ్పీటీసీ రుద్రయ్య నాయుడు, ఎంపీపీ హరిబాబు నాయుడు, వేపంజేరి మార్కెట్ కమిటీ ఛైర్మన్ మోహన్ నాయుడు, అభయ సాయి ట్రస్ట్ ఛైర్మన్ రామమూర్తి రెడ్డి, సంబంధిత ఎంపీటీసీ, సర్పంచ్, జీడీ నెల్లూరు శ్రీధర్, మండల స్థాయి అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

No comments: