రవికిరణాలు(తడ) : ఆంధ్ర ప్రదేశ్ అన్-ఎయిడెడ్ స్కూల్స్ మానేజిమెంట్ అసోసియేషన్ (APUSMA) సభ్యుల బృందం బుధవారం సాయంత్రం శ్రీసిటీని సందర్శించింది. సూళూరుపేటలోని టైనీ టాట్స్ ఉన్నత పాఠశాల డైరెక్టర్ ధనుంజయరెడ్డి ఆధ్వర్యంలో పర్యటనకు విచ్చేసిన ఈ బృందానికి శ్రీసిటీ జనరల్ మానేజర్ సన్యాసి రావ్ వారికి సాదర స్వాగతం పలికారు. శ్రీసిటీలోని మౌళిక వసతులు, పారిశ్రామిక ప్రగతి, విద్యాభివృద్ధికి చేపడుతున్న చర్యల గురించి,వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్రిలేషన్స్) రమేష్ కుమార్ వారికి వివరించారు. ఇప్పటికే చిన్మయ విద్యాలయ, ట్రిపుల్ ఐటీ, ఐ ఎఫ్ ఎం ఆర్, గ్రేట్ లేక్విశ్వవిద్యాలయాలు వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు పని చేస్తుండగా, భవిష్యత్తులో మరిన్ని రానున్నట్లు ఆయన తెలిపారు.వారంతా ఎంటో శ్రద్ధగా విని, తమకున్న పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. తరువాత, బృందం శ్రీసిటీలోని వివిధ ప్రదేశాలను చుట్టిచూడడంతో పాటు, కొన్ని పరిశ్రమలను వీరు సందర్శించి, ఉత్పత్తుల తయారీని పరిశీలించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా, బహుముఖ కార్యకలాపాలను APUSMA నిర్వహిస్తోంది.మానేజిమెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ పర్యటనకు విచ్చేసిన బృందంలో 150 మందికి పైగా సభ్యులు ష్ట్రంలోని వివిధప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="1621,1620,1619"]
No comments: