రవికిరణాలు(నెల్లూరు) : మొహమ్మద్ ఫకృద్ధీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్యర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం 120వ వారానికి చేరుకుంది. కార్యక్రమం మొదలు పెట్టన నాటి నుంచి ఇప్పటి వరకు ఎండైనా, వానైనా లెక్కచేయకుండా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఆదివారం వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఆకలితో ఉన్నవారికి అన్నం పొట్లాలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు నగరంలోని పాత బస్టాండ్, రైల్వేస్టేషన్, చర్చివీధి, ఫైర్ ఆఫీస్ ప్రాంతాల్లో కనిపించిన నిరుపేద, నిరాశ్రయులకు భోజనం పొట్లాలు పంచిపెట్టారు. అన్నదాన కార్యక్రమాలు స్వచ్ఛందంగా నిర్వహించడం చాలా సంతృప్తి కలిగిస్తోందని ఎంఎఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మగ్దూర్ మొహిద్దీన్ తెలిపారు .

No comments: