సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభంకానున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభంకానున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

[gallery ids="541,542,543,544"]

రవికిరణాలు ( తిరుమల - సెల్వం) : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మూత్సవాలు ఈ ఏడాది సెప్టెంబరు 23వ తారీఖు నుండి అక్టోబరు 1వ తారీఖు వరకు జరుగనున్నాయని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సూచనల మేరకు అన్ని విభాగాల అధికారులు ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించుకుని సిద్ధం చేస్తున్నామని టిటిడి తిరుమల జెఈవో కె ఎస్‌.శ్రీనివాసరాజు అన్నారు. సెప్టెంబరు 22వ తేదీ సాయంత్రం అంకురార్పణ, సెప్టెంబరు 23న ధ్వజారోహణంతో బ్రహ్మూత్సవాలు ప్రారంభమౌతాయని తెలిపారు. ధ్వజారోహణం రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. బ్రహ్మూత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 27న గరుడ వాహనం, సెప్టెంబరు 28న స్వర్ణరథం, సెప్టెంబరు 30న రథోత్సవం, అక్టోబరు 1న చక్రస్నానం నిర్వహించనున్నట్టు వివరించారు. సెప్టెంబరు 6న పౌర్ణమి గరుడ సేవను పురస్కరించుకుని మాదిరి గరుడసేవను నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో ఎదురయ్యే సమస్యలు బ్రహ్మూత్సవాలు తిరిగి ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

 

 

 

 

 
సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభంకానున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు Reviewed by CHANDRA BABU on July 04, 2017 Rating: 5 [gallery ids="541,542,543,544"] రవికిరణాలు ( తిరుమల - సెల్వం) : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మూత్సవాలు ఈ ఏడాది సె...

No comments: