4వ వన్డేలో కీలక మార్పులు: సూచాయగా చెప్పిన కోహ్లీ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

4వ వన్డేలో కీలక మార్పులు: సూచాయగా చెప్పిన కోహ్లీ

హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటనలో ఇంకా అవకాశం రాని ఆటగాళ్లకు కచ్చితంగా అవకాశం కల్పిస్తామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీసేన ప్రస్తుతం వెస్టిండిస్‌లో పర్యటిస్తోంది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో విండిస్‌పై విజయం సాధించి 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా ప్రదర్శన పట్ల తాను సంతోషంగా ఉన్నట్లు మూడో వన్డే అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో చెప్పాడు. భారత జట్టు ఘన విజయాలకు సమష్టి ప్రదర్శనే కారణమని అన్నాడు. ప్రధానంగా విండీస్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.
రానున్న మ్యాచ్‌ల్లో తుది జట్టులో కీలక మార్పులు ఉంటాయని సూచన ప్రాయంగా చెప్పాడు. విండీస్ పర్యటనకు గాను జట్టులో చోటు దక్కించుకున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి మూడో వన్డేల్లో ఆడే అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో జట్టులో చోటు దక్కించుకున్న ప్రతీ ఒక్కర్నీ పరీక్షిస్తామని కోహ్లీ అన్నాడు.
'ఇంకా పలువురి ఆటగాళ్లకు విండీస్ పర్యటనలో అవకాశం రాలేదు. కచ్చితంగా వారికి చోటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. రాబోవు మ్యాచ్ ల్లో మార్పులుంటాయి' అని కోహ్లీ పేర్కొన్నాడు. వెస్టిండిస్ పర్యటనకు వెళ్లినప్పటికీ ఇప్పటి వరకు జరిగిన మూడు వన్డేల్లో రిషబ్‌పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, మ1హ్మద్‌ షమీకి తుది జట్టుకు ఎంపిక కాలేదు.
4వ వన్డేలో కీలక మార్పులు: సూచాయగా చెప్పిన కోహ్లీ Reviewed by CHANDRA BABU on July 01, 2017 Rating: 5 హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటనలో ఇంకా అవకాశం రాని ఆటగాళ్లకు కచ్చితంగా అవకాశం కల్పిస్తామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఐదు వన్డే...

No comments: