మహేష్‌బాబు 'స్పైడర్' లేట్ కానుండడంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే కొరటాల శివతో 'భరత్ అను నేను' సెట్స్ మీదకి తీసుకువచ్చేశాడు. తర్వాత వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ ప్రీప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరిగి పోతున్నాయి. 'ఊపిరి'లాంటి ఫీల్ గుడ్ ఫిల్మ్ తర్వాత మహేష్‌తో చేస్తోన్న సినిమా కోసం వంశీ స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు.
మరో ఇంటస్ర్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఇందులో మహేష్‌తో పాటు అల్లరి నరేష్ నటిస్తాడనే ప్రచారం సాగింది. తనకు ప్రిన్స్ ప్రాజెక్ట్‌లో ఆఫర్ వచ్చిన మాట నిజమేనంటూ నరేష్ క్లారిటీ ఇచ్చేశాడు. టాలీవుడ్ యంగ్ హీరోల్లో అల్లరోడుకి కామెడీ నటుడిగా మాంచి ఇమేజ్ వుండేది. ఈ మధ్యకాలంలో సరైన హిట్ ఒక్కటీలేదు. ఇలాంటి సమయంలో మహేష్ లాంటి స్టార్ హీరో ప్రాజెక్టులో నరేష్‌కి ఆఫర్ రావడం అతని కెరీర్ బూస్ట్ ఇస్తుందని అంటున్నారు.

No comments: