రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు ఐటీ మంత్రి లోకేష్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు ఐటీ మంత్రి లోకేష్

రవికిరణాలు(కర్నూలు - రిపోర్టర్ బద్రీ) : కర్నూలు జిల్లా నంద్యాలలో నారా లోకేష్ పర్యటించారు. కానాల గ్రామ సభలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తామని మంత్రి తెలిపారు.ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా 1000 పెన్షన్ ఇస్తున్నారు.2019 లోపు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సి.సి రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం మంత్రి అన్నారు. నంద్యాలను మోడల్ నియోజకవర్గంగా పరిగణించి నూటికి నూరు శాతం సి.సి రోడ్లు, ప్రతి ఇంటికి కులాయి ద్వారా తాగునీటిని అందిస్తామన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్క్ కర్నూలుకు వచ్చింది. రాబోయే రెండు ఏళ్లలో లక్ష ఐ.టి ఉద్యోగాలు, 5 లక్షల తయారీ రంగం ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కానాల గ్రామంలో ఉన్న పేద ప్రజలకు పక్కా ఇళ్ల నిర్మాణం త్వరలోనే చేపడతామన్నరు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో చంద్రబాబు ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా, హౌసింగ్ లోన్లు ఇచ్చామన్నారు.
రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు ఐటీ మంత్రి లోకేష్ Reviewed by CHANDRA BABU on July 13, 2017 Rating: 5 రవికిరణాలు(కర్నూలు - రిపోర్టర్ బద్రీ) : కర్నూలు జిల్లా నంద్యాలలో నారా లోకేష్ పర్యటించారు. కానాల గ్రామ సభలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.ద...

No comments: