రవికిరణాలు(తిరుమల) : తిరుమలలో గదులు కేటాయించే కంప్యూటర్లు మొరాయించాయి. ఫలితంగా భక్తులు నానాపాట్లు పడ్డారు. గోవిందా ఇదేంటి మా పరిస్థితి అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి దాదాపు నాలుగు గంటల వరకు తిరుమలలో సీఆర్ఓ, పద్మావతి, ఎంబిసి 34 వద్ద అద్దె గదులు కేటాయించే కంప్యూటర్లు పూర్తిగా మొరాయించాయి. దీంతో భక్తులు తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ఇప్పుడు ఇస్తున్న టోకెన్ పద్ధతి బాలేదని పాత పద్ధతే బాగుందని భక్తులు వాపోయారు. ఇకనైనా టీటీడీ వారు స్పందించి తగుచర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు.
[gallery td_select_gallery_slide="slide" ids="1724,1723,1722"]
[gallery td_select_gallery_slide="slide" ids="1724,1723,1722"]
No comments: