[gallery td_select_gallery_slide="slide" ids="688,686,685"]
రవికిరణాలు (తడ): నూతనంగా నిర్మితమైన నాలుగు లేన్ల శ్రీసిటీ సెంట్రల్ ఎక్స్ ప్రెస్ రహదారిని గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన సత్యవేడు సి.ఐ. నరసింహులు, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి జెండా ఊపి రోడ్డుపై రాకపోకలను ప్రారంభించారు. 9 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్ ప్రెస్ రహదారి శ్రీసిటీ ప్రధాన ముఖద్వారం నుంచి ప్రధాన పరిశ్రమలను కలుపుతూ కస్టమ్స్ కార్యాలయం వరకు కొనసాగుతుంది. ట్రాఫిక్ సౌలభ్యం కొరకు ఎక్స్ ప్రెస్ రహదారి రెండు వైపుల నిర్మాణం పూర్తి చేసి గురువారం నుంచి రాకపోకలను ప్రారంభించారు.
No comments: