రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఊచకొండపాలెం గ్రామస్తులు రోడెక్కారు. ఇఫ్కో కర్మాగారం కోసం భూములు తీసుకున్న ప్రభుత్వం తమను పట్టించుకోకుండా వదిలేసిందని ఆవేశంతో మండిపడ్డారు. అన్నం పెట్టే భూమిని లాక్కుని తినడానికి తిండి లేకుండా చేశారని వాపోయారు. న్యాయం చేస్తారా లేదా అని కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఇఫ్కో కర్మాగారం నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం రైతుల నుంచి 2వేల 776 ఎకరాల భూమిని సేకరించింది. అప్పట్లో ఇంటికో ఉద్యోగం.. పరిహారం అస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ ఏళ్లు గడిచిపోతున్నా..కర్మాగారం ఏర్పడలేదు.. తమకు పరిహారమూ రాలేదని రైతులు వాపోతున్నారు. పూటగడవడానికి కూడా కష్టతరంగా ఉన్న తమ బతుకులను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు. కలెక్టర్ వాహనాన్ని చుట్టుముట్టిన గ్రామస్తులను పోలీసులు అదుపు చేశారు. కష్టం చెప్పుకోడానికి కలెక్టర్ వద్దకు వస్తే... అడ్డుకుంటారా అంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
బతకలేకపోతున్నా..... పట్టించుకోరా...?
బతకలేకపోతున్నా..... పట్టించుకోరా...?
Reviewed by CHANDRA BABU
on
July 23, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఊచకొండపాలెం గ్రామస్తులు రోడెక్కారు. ఇఫ్కో కర్మాగారం కోసం భూములు తీసుకున...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: