రవికిరణాలు (వనిత) : ఫలాల్లో రారాజు మామిడి. మామిడి అంటే ఇష్టపడని వారు ఉండరు అది పచ్చిదైనా, పండైనా. పచ్చి మామిడికి ఉప్పు కారం పట్టించి తింటే ఆహా అనిపిస్తుంది. అదే పచ్చి మామిడి తలకి పట్టిస్తే...ఏమవుతుంది ? ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం అవుతుంది. కొన్ని మామిడి ఆకులను తీసుకొని వాటిని పేస్టుచేసి జుట్టుకి అప్లై చేసి 15-20 నిమిషముల తరువాత మంచి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన మీకు జుట్టు తొందరగా పెరుగుతుంది. అలానే నల్లగా కూడా అవుతుంది. కొన్ని మామిడి ఆకులను, కొన్ని పచ్చిమామిడి తొక్కలను తీసుకొని కలిపి వాటిని ఆయిల్లో వేసి చాల కాలం వరకు సూర్యరశ్మి తగిలేల ఎండలోఉంచాలి. ఆ ఆయిల్ రాసుకోవడం వలన జుట్టు రాలటాన్ని ఆపి నల్ల జుట్టు వచ్చేలా చేస్తుంది. మామిడి విత్తనం యొక్క నూనెను వాడటం వలన తెల్లజుట్టు నల్లజుట్టుగా మారుతుంది. అలానే జుట్టు రాలటాన్ని ఆపి,
చుండ్రు రాకుండా చేస్తుంది.
చుండ్రు రాకుండా చేస్తుంది.
No comments: