రవికిరణాలు(వనిత): బీరకాయను కూర, పచ్చడి చేసుకోవడానికే కాదు జుట్టుకు కూడా వినియోగించుకోవచ్చు. బీయకాయ వల్ల తెల్లజుట్టు నల్లగా మారుతుంది. మీరు నల్లని జుట్టు కోసం ప్రయత్నిస్తుంటే వెంటనే ఈ చిట్కాను ప్రయత్నించండి.
ఎండిన బీరకాయను తీసుకుని ముక్కలుగా కోసుకోవాలి. ఆ ముక్కలను కొబ్బరి నూనెలో మూడు రోజులపాటు నానబెట్టాలి. మూడు రోజుల తర్వాత బీరకాయ ముక్కలు వేసిన కొబ్బరి నూనెను స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. నూనె మరిగి నల్లగా తయారైన తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత ఆ నూనెను వడగట్టి ఓ సీసాలో భద్రపరుచుకోవాలి. ఇలా తయారుచేసిన నూనెను తలమీద మసాజ్ చేసుకుని గంట తర్వాత తలస్నానం చేయాలి. తరచూ ఈ నూనె వాడడం వల్ల నల్లని కురులు మీకు సొంతమవుతాయి.
No comments: