తిరుపతి అర్బన్ ఎస్పీగా అభిషేక్ మహంతి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

తిరుపతి అర్బన్ ఎస్పీగా అభిషేక్ మహంతి

రవికిరణాలు(తిరుపతి): తిరుపతి అర్బన్ ఎస్పీగా అభిషేక్ మహంతి ఐపియస్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ తిరుపతి ప్రజలకు అన్ని రకాల మెరుగైన సేవలు అందిస్తానని వెల్లడించారు. పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం పనిచేస్తుందని ఎలాంటి సమస్యలైనా పోలీసులను ఆశ్రయం కొరవచ్చు అని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి తిరుపతి ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తామని ఎస్పీ మహంతి స్పష్టం చేశారు. ప్రతి సోమవారం ఫిర్యాదుల కోసం సమయం కేటాయిస్తానని, ఆపదలలో ఉన్నవారు ఎప్పుడైనా తనని కలవవచ్చను తిరుపతి ప్రజలకు ఎస్పీ తెలిపారు. పుణ్యస్థలమైన తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద పనిచేయడం ర్వజన్మసుకృతంగా భావిస్తున్నాను ఎస్పీ సంతోషం వ్యక్తం చేశారు. ఐపియస్ బ్యాచ్ 2011కు చెందిన ఈయన ఇదివరకు గుంటూరు అర్బన్ ఎస్పీగా పనిచేసిన విషయం విదితమే.
తిరుపతి అర్బన్ ఎస్పీగా అభిషేక్ మహంతి Reviewed by CHANDRA BABU on July 03, 2017 Rating: 5 రవికిరణాలు(తిరుపతి): తిరుపతి అర్బన్ ఎస్పీగా అభిషేక్ మహంతి ఐపియస్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన...

No comments: