రవికిరణాలు(సినిమా): నందమూరి తారక రాముడు రావణుడి అవతారమెత్తాడు. అల్లరి రాముడిగా అలరించి, యమదొంగగా మురిపించి... నందమూరి వారసుడనిపించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మరో సారి శభాష్ అనిపించేందుకు సిద్ధమయ్యాడు. నవరస నటనా సార్వభౌమిడి వారసుడిగా ఆయన పోలికలు అందిపుచ్చుకున్న జూనియర్ తన నటనా కౌశలంతో స్టార్ హీరాగా సుస్థిర స్థానాన్ని చేరుకున్నాడు. యాక్షన్, సెంటిమెంట్, లవ్... ఇలా ఏదైనా అవలీలగా చేస్తూ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. టెంపర్‌లో కాస్త నెగిటివ్ షేడ్‌తో కనిపించి... ఆ కోణానికీ తను ఫిట్ అని నిరూపించుకున్నాడు. టెంపర్‌లో కాస్త నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించిన జూనియర్ ఇప్పుడు ఫుల్‌లెన్త్ విలనిజంతో అబ్బురపరిచేందుకు సిద్ధమయ్యాడు. రావణుడిని చంపాలంటే సముద్రమంత ధైర్యముండాలంటూ టీజర్‌తో అధరగొడుతున్నాడు ఈ నందమూరి రాముడు. నందమూరి ఆర్ట్స్ బ్యానర్‌పై సోదరుడు కల్యాణ్‌రామ్ నిర్మించిన జైలవకుశ చిత్రం టీజర్ ఎన్టీఆర్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. దేవిశ్రీ అందించిన సంగీతం ప్రాణం పోసినట్లుంది. డైలాగ్ డెలివరీలో ది బెస్ట్ అనిపించుకున్న జూ. ఎన్టీఆర్ జై పాత్రలో నత్తిగా మాట్లాడుతూ మరో కొత్త యాంగిల్‌ను టచ్ చేశాడు. ఆహా అనిపించేలా ఉన్న చిత్రీకరణ మధ్య గంభీర్యంగా ఉన్న జూ. ఎన్టీఆర్ టీజర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
[video width="1280" height="720" mp4="http://www.ravikiranalutv.in/wp-content/uploads/2017/07/Jai-Lava-Kusa-Teaser-Introducing-JAI-NTR-Nandamuri-Kalyan-Ram-Bobby.mp4"][/video]
[video width="1280" height="720" mp4="http://www.ravikiranalutv.in/wp-content/uploads/2017/07/Jai-Lava-Kusa-Teaser-Introducing-JAI-NTR-Nandamuri-Kalyan-Ram-Bobby.mp4"][/video]
No comments: