రవికిరణాలు(శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా అమదాలవలస పట్టణంలో పలుచోట్ల ఎసిబి అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. వార్డెన్లు వసతిగృహాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారన్న సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి. ఆమదాలవలస వసతి గృహంలో మొత్తం 89మంది విద్యార్థులు ఉండగా.. కేవలం 39మందికి మాత్రమే భోజన వసతి కల్పిస్తున్నారని అధికారుల తనిఖీలో తేలింది. వివరణ కోసం వార్డెన్ మహంతి ఉమామహశ్వరరావును పిలిస్తే.. వచ్చేందుకు నిరాకరిస్తున్నారని తెలిపారు. ఇదే వ్యక్తి బూర్జి మండలం తోటవాడలో కూడా వార్డేన్ గా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా ఇదేవిధంగా 62మంది విద్యార్థులకు 18మందికి భోజనాలను ఏర్పాటు చేస్తున్నారని, రికార్డుల్లో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని అధికారులు వెల్లడించారు. వార్డెన్ ఉమామహేశ్వరరావు పోన్ లో సైతం అందుబాటులోలేరని తెలపారు. ఈ దాడుల్లో ఎబిసి.డబ్ల్యూ.ఓ
[gallery td_select_gallery_slide="slide" ids="951,950,949,948"]
ఎ.శ్యామలాకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="951,950,949,948"]
ఎ.శ్యామలాకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.
No comments: