రవికిరణాలు( వెంకటగిరి) : నెల్లూరు జిల్లా వెంకటగిరి నాయుడుపేట రహదారిపై పోలీసులు భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ పీహెచ్‌డీ రామృష్ణకు వచ్చిన సమాచారం మేరకు జిల్లా రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంకటగిరి మోడల్ స్కూల్ వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. పోలీసులకు సహకరించకుండా వేగంగా వెళ్లిపోయిన వాహనాన్ని వెంబడించి పట్టుకున్న పోలీసులు అందులో ఉన్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న దొంగలను అరెస్టు చేశారు. 240కేజీల ఎర్రచందనం దుంగలను, టొయోట కోరల్ల కారు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన దొంగలు ఇచ్చిన సమాచారం మేరకు చెన్నైలోని గాంధీనగర్ వద్ద అన్నామలై పరమశివం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 100 కేజీల 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="957,954,955,956"]
[gallery td_select_gallery_slide="slide" ids="957,954,955,956"]
No comments: