రవికిరణాలు(నెల్లూరు-చందు): నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ నెల్లూరు పర్యటన విజయవంతం అయ్యిందని అన్నారు. నుడా చైర్మన్‌గా బాలకృష్ణ సమక్షంలో తాను ప్రమాణస్వీకారం చేయడం చాలా ఆనందకరమని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వెల్లడించారు. బాలకృష్ణ పర్యటనను విజయవంతం చేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నుడా చైర్మన్‌గా తాను నెల రోజుల క్రితమే నియమింపబడ్డానని, అయితే ప్రమాణ స్వీకారం తరువాత సోమవారం నుంచి విధుల్లోకి దిగుతున్నానని వివరించారు. బాలాజీ నగర్లో నిర్మిస్తున్న నుడా కార్యాలయం పూర్తయ్యేందుకు మరికొంత సమయం పడుతుందని, అప్పటి వరకు తనకు ఏదైనా కార్యాలయం కేటాయించాల్సిందిగా మంత్రులను కోరారు. ఒకవేళ కార్యాలయం కేటాయించకపోయినా చెట్ల కింద కుర్చిని అయినా పాలన సాగిస్తానని స్పష్టం చేశారు. సమయం లేదని, వేగంగా నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ పరిధిలోని ప్రాంతాలను అబివృద్ధి చేస్తానని, నుడాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెడతానని వెల్లడించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు పిండి సురేష్ , నూనె మల్లిఖార్జున యాదవ్, గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
చెట్టు కింద కూర్చునైనా పని చేస్తా...!
చెట్టు కింద కూర్చునైనా పని చేస్తా...!
Reviewed by CHANDRA BABU
on
July 02, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు-చందు): నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి విలేకర్ల సమావేశం నిర్వ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: