రవికిరణాలు(వెంకటరిగి) : నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాణిపేటలో జిఎన్‌ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిరుపేద విద్యార్థులకు నగదు సహాయం అందజేశారు. మొత్తం 51 మంది విద్యార్థులకి 1,15,000 రూపాయలు అందించామని, మా ట్రస్ట్ సభ్యుల సహకారంతో నిరుపేద విద్యార్థులకి పుస్తకాలు, యూనిఫామ్స్ తదితర కొనుగోలుపై మావంతు సహాయం గా ఒక్కొక్క విద్యార్థి కి 1000 రూపాయల నుండి 25 వేల రూపాయల వరకు అందించామని ట్రస్ట్ చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రంగినేని వెంకటేశ్వరరావు, ఆర్గనైజర్ రవి, ట్రెజరర్ సారధి, సభ్యులు దశకుమార్, నంద తదితరులు పాల్గొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="1316,1314,1315"]
[gallery td_select_gallery_slide="slide" ids="1316,1314,1315"]
No comments: