ఘనంగా ఆణివారి ఆస్థానం మహోత్సవం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఘనంగా ఆణివారి ఆస్థానం మహోత్సవం

రవికిరణాలు (తిరుమల - సెల్వం) : తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక ఆణివారి ఆస్ధానం మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి వారి ఆలయంలో వార్షిక ఆదాయ వ్యయాలకు సంభందించిన లెక్కలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. అనాది కాలంగా వస్తున్న ఈ అచారాన్ని టీటీడి ఇప్పటికీ కొనసాగిస్తూంది. ఈ సందర్భంగా శ్రీరంగం దేవస్థానం పంపిన పట్టు వస్త్రాలను ఆ రాష్ట్ర దేవదాయశాఖ ఆధికారులు స్వామి వారికి సమర్పించారుకలియుగ వైకుంఠనాధుడైన శ్రీవారి ఆలయంలో వార్షిక బడ్జెట్ తమిళ సంప్రదాయం ప్రకారం ఆణిమాసం చివరి రోజున అంటే 16న జరపబడుతుంది. శాసనాలలో లభించిన సమాచారం మేరకు విజయనగర సామ్రాజ్యం కాలం నుండి ఈ కార్యక్రమం శ్రీవారి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రాంతి నాడు....అంటే తమిళుల సంప్రదాయం ప్రకారం ఆణిమాసం చివరి రోజున జరిగే ఉత్సవం కావడంతో... ఈ వేడుకలకు ఆణివార ఆస్థానం అనే పేరు వచ్చింది. చారిత్రక నేపథ్యంలో పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలన స్వీకరించిన రోజైన ఆణివార ఆస్థానం పర్వదినం నుండి టీటీడి వార్షిక బడ్జెట్ ప్రారంభమైయ్యేది. టీటీడి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ ఏప్రిల్ కు మారినపట్టికి....ఆనాదికాలంగా వస్తున్న ఆచారాని అనుసరిస్తూ నేటికీ శ్రీవారి ఆలయంలో ఈ ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాదికి సంభందించిన లెక్కలను టీటీడి నేటి నుంచి ప్రారంభించింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో స్వామి వారు సర్వభూపాల వాహనంపై వేంచేసి ఉండగా ....మరో పీఠంలో స్వామి వారి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుల వారిని దక్షిణముఖంగా ఉంచి గరుడాళ్వారు సన్నిధిలోని ఘంటా మండపంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జీయ్యర్ స్వాములు మంగళవాయిద్యల నడుమ తమ శిష్యబృందంతో కలిసి ఊరేగింపుగా వెండి పల్లెంలో ఆరు పట్టువస్త్రాలను తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించారు. వీటిలో నాలుగింటిని శ్రీవారి మూలవిరాట్టుకు అలంకరించనుండగా మిగిలిన రెండు వస్త్రాలలో ఒక్కటి మలయప్పస్వామి వారికి, మరొకటి విష్వక్సేనుల వారికి ఆలంకరిస్తారు. తదనంతరం అర్చకులు ఆలయ తాళాల గుత్తని ఆలయ అధికారులకు అందజేసి ఆలయ మర్యాదాలతో సత్కరించారు. అటు తరువాత ఆలయ అర్చకులు తాళాల గుత్తిని శ్రీవారి పాదాల వద్ద ఉంచారు. ఆణివార ఆస్థానం కార్యక్రమాని పురస్కరించుకుని సుఫ్రభాతసేవ మినహా శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జితబ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహాస్రదీపాలకంరణ సేవలను టీటీడి రద్దు చేసింది. నేటి సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయ్యప్పస్వామి పుష్పపల్లకిలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

 
ఘనంగా ఆణివారి ఆస్థానం మహోత్సవం Reviewed by CHANDRA BABU on July 16, 2017 Rating: 5 రవికిరణాలు (తిరుమల - సెల్వం) : తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక ఆణివారి ఆస్ధానం మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి వారి ఆలయంలో వ...

No comments: