రవికిరణాలు(నెల్లూరు -స్టాఫ్‌రిపోర్టర్ చందు) : నెల్లూరులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నెల వ్యవధిలోనే రెండు ట్రాప్ కేసులను పట్టుకున్న ఏసీబీ అధికారులు తాజాగా మరో అవినీతి అధికారి ఇంటిపై దాడులు చేశారు.నెల్లూరులోని శ్రీ రంగనాయకులస్వామి ఆలయ ఈవో పోరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి జగన్నాథశర్మ ఆస్తులుపై ఏసీబీ అధికారులు ఏక కాలంలో సోదాలు చేశారు. 7 బృందాలుగా ఏర్పడిన ఏసీబీ అధికారులు శ్రీనివాసులరెడ్డి బంధువుల ఇళ్ళతో పాటు స్నేహితుల ఇళ్లల్లోనూ అకస్మిక దాడులు నిర్వహించారు. ఈవో శ్రీనివాసులరెడ్డి నివాసం ఉంటున్న రేబాల
లక్ష్మీనరసింహరెడ్డినగర్‌లో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే దాడులు జరిగాయి. మూలాపేట శివాలయం
సీనియర్ అసిస్టెంట్ మాధవి, మాగుంటలేవుట్‌లో నివాసం ఉండే సాయి డెవలపర్స్ అమర్ కుమార్ నివాసాల్లో మరో టీమ్
దాడులు చేసింది. ఈ దాడుల్లో భారీగా నగలు, నగదుతో పాటు భారీగా డాక్యుమెంట్లు దొరికాయి. శ్రీ రంగంధస్వామి దేవస్థాన ప్రధానార్చకులు జగనాథశర్మ ఇంట్లో ఏసీబీ దాడి సోదలో 12 ఆస్తులు ,25లక్షలు క్యాష్, 1 1/2 కిలో బంగారం, 5కేజీల వెండి దొరికినట్లు సమాచారం.
[gallery td_select_gallery_slide="slide" ids="1203,1202,1201,1200,1198,1197,1196,1195,1194,1193,1192"]

No comments: