రవికిరణాలు(తిరుమల - సెల్వం) : తిరుమల సప్తగిరి కాటేజీలో సీవీఎస్వో రవికృష్ణ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు గదుల కోసం దళారులను ఆశ్రయించవద్దని, టోకెన్ జారీ కౌంటర్ల ద్వారా నమోదు చేసుకుని గదులు పొందాలని టిటిడి సివిఎస్వో రవికృష్ణ కోరారు. తిరుమలలోని శంకుమిట్ట, పాంచజన్యం, సప్తగిరి, ఏఎంసి,సూరాపురంతోట కాటేజీలను ఆదివారం ఆయన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సివిఎస్వో రవికృష్ణ మాట్లాడుతూ గదుల దళారులు తారసపడితే భక్తులు వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. గదులు కేటాయింపు సమాచారాన్ని ఎస్‌ఎంఎస్ రూపంలో అందించడం భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. దళారులను అరికట్టేందుకు నిరంతరం తనిఖీలు చేపడతామన్నారు. ఈ తనిఖీల్లో విఎస్‌ఓ విమలకుమారి, ఎవిఎస్వో శ్రీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="1406,1405,1404"]
[gallery td_select_gallery_slide="slide" ids="1406,1405,1404"]
No comments: