రవికిరణాలు(హైదరాబాద్): తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డికి ఈ ఉదయం శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చుక్కెదురైంది. విజయవాడకు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఉదయం 6:40 గంటలకు విజయవాడ వెళ్లే ట్రూ జెట్ విమానంలో ప్రయాణించేందుకు ఆయన టికెట్ బుక్ చేసుకోగా, "మీపై నిషేధం ఉన్న కారణంగా అనుమతించలేము" అని ట్రూ జెట్ సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక జేసీ వెనుదిరిగారు. ఇటీవల విశాఖపట్నంలో ఆయన విమానాశ్రయ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జేసీపై పలు విమానయాన సంస్థలు నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. ఆ రోజు విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు చొరవతో విమానం ఎక్కినా, ఆ తరువాత జేసీ విమానాశ్రయానికి వెళ్లి విమానం ఎక్కలేకపోవడం ఇదే తొలిసారి.
విమానం ఎక్కలేక పోయిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి
Reviewed by CHANDRA BABU
on
July 09, 2017
Rating: 5
రవికిరణాలు(హైదరాబాద్): తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డికి ఈ ఉదయం శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: