రవికిరణాలు ( ప్రహల్య) : నిధి అంటే డబ్బు కాదు. ఒకటి, రెండు, మూడు..... వంద, వెయ్యి.... కోటి... శతకోటి.... నిధి. ఏంటి ఏదో చెప్తున్నారనుకుంటున్నారా....? ఒకటి, రెండు , మూడు అనేవి సంఖ్యలు. సంఖ్యలను ఎక్కడివరకు పలకగలరు కోటి వరకు అంతేకదా. కానీ హైందవధర్మంలో ఇంకా చాలా సంఖ్యలు ఉన్నాయి. నోరు పలకలేనంత పెద్ద సంఖ్యకు మన తెలుగు భాషలో నిర్థష్టమైన పదాలు ఉన్నాయి.
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అనే నానుడి చాలా మంది నోట వింటూ ఉంటాం. ఇక్కడ శత కోటి అంటే 100కోట్లు మరి అనంత కోటి అంటే ఎంత...? లెక్కలేనంత అని మాత్రం సమాధానం చెప్పకండి..!! . అనంతకోటి అంటే మన తెలుగులో ఉన్న ఓ సంఖ్య పేరు.. ఆ సంఖ్య ఏంటో తెలుసా...? 100000000000. కోట్లలోకి అనువదిస్తే 10వేల కోట్లు అన్నమాట. సాధారణంగా మనం భారీగా ఉన్న సంఖ్యల గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే పదాల్లో కొన్ని మన తెలుగు సంఖ్యల్లోనివే. అవి తెలియక మనం వాటిని సంఖ్యలుగా కాక పదాలుగా వాడేస్తున్నాం.
లక్ష కోట్లు అనేది ఇప్పుడు మనం తరచుగా వార్తాపత్రికల్లో చూస్తున్నాం. అది ఎందుకు అనేది ప్రస్తుతానికి మనకు అప్రస్తుతం. కానీ లక్ష కోట్లు అనే సంఖ్యకు తెలుగులో నిర్థష్టమైన పేరు ఉంది అదేంటో తెలుసా...?న్యార్భుద్ధం. అంటే లక్షకోట్లు అంటే న్యార్బుద్ధం అన్న మాట. 10లక్షల కోట్లు అంటే ఖర్వం. 100లక్షల కోట్లు అంటే మహాఖర్వం. 1000లక్షల కోట్లు అంటే పద్మం. పద్మం అంటే అంత పెద్ద సంఖ్య కాబట్టేనేమో.. అనంత పద్మనాభ స్వామి వద్ద అంత పెద్ద మొత్తం దొరికింది. ఇక్కడ ఇంకో విషయం అనంతం అన్నా కూడా తెలుగు సంఖ్యే. దాని విలువ ఇంకా కొంచెం కిందకు వెళ్లాక తెలుస్తుంది.
పద్మం తర్వాత వచ్చే సంఖ్య మహా పద్మం అంటే 10వేల లక్షల కోట్లు. క్షోణి అంటే లక్ష లక్షల కోట్లు. మహాక్షోణి అంటే 10లక్షల లక్షల కోట్లు. శంఖం 100లక్షల లక్షల కోట్లు. ఇక్కడ 100లక్షలను కోటిగా చూద్దాం. అప్పుడు శంఖం కోటి లక్షల కోట్లు. మహాశంఖం 10కోటి లక్షల కోట్లు. క్షితి అంటే 100కోట్ల లక్షల కోట్లు. మహాక్షితి 1000కోట్ల లక్షల కోట్లు. క్షోభం అంటే 10వేల కోట్ల లక్షల కోట్లు. మహాక్షోభం అంటే లక్ష కోట్ల లక్షల కోట్లు. ఆ తర్వాత వచ్చే సంఖ్యే మన తెలుగు వారి నోటి వెంట వచ్చే నిధి. నిధి అంటే లెక్కలేనంత డబ్బు, బంగారం, కాదు. లెక్కపెట్టడానికి ఉపయోగపడే సంఖ్య. ఆ సంఖ్య ఎంతో తెలుసా.... 10లక్షల కోట్ల లక్షల కోట్లు.
నిధి అంటే ఎంతో చూశారుగా.... పలికేందుకు కష్టంగా ఉన్నంత పెద్ద మొత్తాన్ని తెలిపే సంఖ్య. అప్పుడే నోరెళ్లబెట్టకండి.. నిధికన్నా ఇంకా పెద్ద సంఖ్యలు ఉన్నాయి మన తెలుగులో. 10నిధులు అంటే మహానిధి. 100నిధులు అంటే పరాటం. 1000నిధులు అంటే పరార్థం. 10వేల నిధులు అంటే అనంతం. అనంతం అంటే లక్ష లక్షల కోట్ల లక్షల కోట్లన్న మాట. 10అనంతాలు అంటే సాగరం. 100అనంతాలు అంటే అవ్యయం. 1000అనంతాలు అంటే అమృతం. 10వేల అనంతాలు అంటే అచింత్యం. లక్ష అనంతాలు అంటే అమేయం.
భూరి అనే పదం చాలా చోట్ల వింటుంటాం. ఎక్కువ మొత్తంలో విరాళాలు ఇచ్చినప్పుడు భూరీ విరాళం అంటారు. అసలు భూరి అంటే ఎంతో తెలుసా... 10లక్షల అనంతాలు. అంటే కోటి నిధులు. ఇక మన తెలుగు సంఖ్యలో చివరికి అతి పెద్దది మహాభూరి.. దాని సంఖ్య కోటి అనంతాలు.

No comments: