రవికిరణాలు(తిరుమల) : తిరుమల పోలీస్ కాంప్లెక్స్ లో వేలిముద్రల ఆధారంగా పాత నేరస్తులను గుర్తించే సాఫ్ట్‌వేర్ ను ప్రయోగాత్మకంగా తిరుపతి అర్బన్ యస్పీ అభిషేక్ మహంతి పరిశీలించారు. వేలిముద్రల ఆధారంగా పాత నేరస్తులను గుర్తించేందుకు ఓ కొత్త సాఫ్ట్‌వేర్ ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తిరుపతి అర్బన్ యస్పీ తెలిపారు. అలాగే ఈ సాఫ్ట్‌వేర్‌ను రక్షక వాహనాలకుఅనుసంధానం చేస్తున్నామని తద్వారా నేరస్తులను వెంటనే గుర్తించవచ్చన్నారు. త్వరలోనే ఫొటోగ్రాఫ్ ద్వారా నేరస్తులను గుర్తించే పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ పరిజ్ఞానానం ద్వారా తిరుపతి అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గానా వచ్చే నేరస్తులను, అనుమానితులను వెంటనే గుర్తించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమాన్ని (FINS) ఫ్యూచర్ ఇన్విటేషన్ నెట్ వర్క్ సొల్యూషన్ సిఇఓ దినేష్, యస్పీ పరిశీలంచారు. ఈ కార్యక్రమంలో తిరుమల అడిషనల్ యస్పీ మురళీకృష్ణ, సీఐ లు వెంకట్ రవి, రామకృష్ణ, యస్ఐ తిమ్మయ తదితరులు పాల్గొన్నారు.
పాత నేరస్థులు కబడ్ధార్....
Reviewed by CHANDRA BABU
on
July 20, 2017
Rating: 5
రవికిరణాలు(తిరుమల) : తిరుమల పోలీస్ కాంప్లెక్స్ లో వేలిముద్రల ఆధారంగా పాత నేరస్తులను గుర్తించే సాఫ్ట్‌వేర్ ను ప్రయోగాత్మకంగా తిరుపతి అర్బన్ య...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: