సినీరంగంపై ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పంజా - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

సినీరంగంపై ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పంజా

రవికిరణాలు(సినిమా): సినీరంగంపై ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం పంజా విసిరింది. నార్కోటిక్‌ డ్రగ్స్‌, సైకోట్రాపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్ట్‌-1985లోని సెక్షన్‌ 67 ప్రకారం నోటీసులు పంపిన వారందరి పేర్లను ప్రకటించింది. హీరో, హీరోయిన్‌, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ అన్న తేడా లేకుండా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలతో సంబంధం ఉన్నవారందరినీ విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. వారిలో ప్రముఖ హీరో రవితేజ, హీరోయిన్‌ ఛార్మీ, దర్శకుడు పూరిజగన్నాథ్‌ తదితరులు ఉన్నారు. డ్రగ్స్ కేసులో సినీరంగానికి సంబంధించి జారీ చేసిన నోటీసులపై సిట్ కార్యాలయంలో అధికారి ఆకున్ సబర్వాల్ సమీక్ష
నిర్వహిస్తున్నారు. సినీ రంగానికి సంబంధించి ఇప్పటి వరకు 8 నుంచి 10 మందికి నోటీసులు జారీ చేశామని, మరికొంతమందికి కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే నోటీసులు అందుకున్నవారంతా ఈనెల 19 నుంచి 27 వరకు సిట్ కార్యాలయంలో హాజరు కావాలని ఆ నోటీసుల్లో సూచించారు. కాగా ఈ నోటీసులు అందుకున్నవారిలో డ్రగ్స్ తీసుకుంటున్నవారు ఉన్నారని, డ్రగ్స్ మరికొంతమందికి సరఫరా చేసేవాళ్లు కూడా ఉన్నారని, ఎవరికి సప్లై చేసింది, వాళ్లంతవాళ్లే సెల్ఫ్ కోసం డ్రగ్స్ తీసుకుంటే ఎంతకాలంగా తీసుకుంటున్నారు? వాళ్లకు సరఫరా చేసే వ్యక్తులు ఎవరు? అన్న విషయాన్ని సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది.
సినీరంగంపై ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పంజా Reviewed by CHANDRA BABU on July 14, 2017 Rating: 5 రవికిరణాలు(సినిమా): సినీరంగంపై ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం పంజా విసిరింది. నార్కోటిక్‌ డ్రగ్స్‌, సైకోట్రాపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్ట్‌...

No comments: