రవికిరణాలు(తిరుమల - సెల్వం) : జూలై 12 నుండి తిరుమలలో టోకెన్ విధానం ద్వారా గదుల కేటాయింపు నిర్వహించారు.
తిరుమలలో గదుల కోసం భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా టీటీడీ టోకెన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. సీఆర్‌వోలో 10, ఎంబీసీలో-34లో ఒక కౌంటర్‌ను ఏర్పాటుచేశారు. ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు
రెండు స్లాట్లద్వారా ఈ కౌంటర్ల వద్ద భక్తులు ఆధార్ నెంబరు ద్వారా నమోదు చేసుకోవాలి. కావాల్సిన గది కేటగిరిని తెలపాలి. నమోదు పూర్తికాగానే టోకెన్ ఇస్తారు. గది ఖాళీ కాగానే ఎస్‌ఎంఎస్ వస్తుంది. అరగంటలోపు భక్తులు అలాట్‌మెంట్ కౌంటర్లకు వెళ్లి గదులు పొందాలి. లేకుంటే ఆ తరువాత సీరియల్ నంబరు గల భక్తులకు వీటిని కేటాయించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది.
[gallery td_select_gallery_slide="slide" ids="1005,1004,1003"]
No comments: