రవికిరణాలు(తడ) : శ్రీసిటీలో మరో ఆటోమొబైల్ విడిభాగాల తయారీ పరిశ్రమకు భూమిపూజ జరిగింది. జపాన్ కు చెందిన ఆటోమొబైల్ విడిభాగాల తయారీ పరిశ్రమ "తొహుకు స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్" కు శుక్రవారం భూమిపూజ చేశారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ యమడ, డైరెక్టర్ నొనక సమక్షంలో ప్రెసిడెంట్ యమగుచి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా నిర్వహించారు. శ్రీసిటీలో ఉన్న పలు జపాన్ కంపెనీల సీఈఓలు, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. సుమారు 80 కోట్ల పెట్టుబడితో ఆటోమొబైల్స్ ఇంజిన్ వాల్వ్స్ ను తయారు చేసే ఈ పరిశ్రమ కోసం శ్రీసిటీ డొమెస్టిక్ టారిఫ్ జోన్లో 6 ఎకరాల స్థలం కేటాయించారు. భారత ప్రభుత్వం ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా పిలుపుకు స్పందించి పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావడం జరిగిందని యమగుచి వెల్లడించారు. 2018 ఏడాది చివరిన కంపెనీ ఉత్పత్తులు ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జపాన్ దేశానికి చెందిన 17 వ కంపెనీ ఇక్కడకు రావడం పట్ల శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ యమగుచికి అభినందనలు తెలుపారు. ఇసుజు, కొబెల్కొ వంటి పెద్ద కంపెనీలతో పాటు, జపాన్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, బెహ్రయిన్ లకు చెందిన 17 అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు కాబడి,
శ్రీసిటీలో ఆటోమొబైల్ రంగ అభివృద్ధికి అత్యంత అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="1705,1704,1703,1702"]
శ్రీసిటీలో ఆటోమొబైల్ రంగ అభివృద్ధికి అత్యంత అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="1705,1704,1703,1702"]
No comments: