రవికిరణాలు(తిరుమల-సెల్వం): శ్రీవారి పాదలవద్ద బళ్లారి భక్తులకు పెను ప్రమాదం తప్పింది. 18 మంది భక్తులతో శ్రీవారి పాదాలను దర్శించుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా బస్సు బ్రేక్ ఫేల్ అవడంతో ఎదురుగా వస్తున్న సుమ్మోను ఢీకొని లోయలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు బస్సు చెట్టును ఢీకొని కొండ అంచున ఆగిపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బళ్లారికి చెందిన పది మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక అశ్విని హాస్పిటల్ కు తరలించారు. ఘటనా స్థలిని సీవీఎస్వో రవికృష్ణ పరిశీలించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.
[gallery td_select_gallery_slide="slide" ids="768,767,766,765,764,763,762"]
No comments: