[gallery td_select_gallery_slide="slide" ids="779,778,777,776,775,774,773,772"]
రవికిరణాలు(శ్రీకాకుళం-శ్రీనివాస్): శ్రీకాకుళం జిల్లా అమదాలవలసలో మూడేళ్ళుగా నలుగుతున్న కూరగాయల మార్కెట్ తొలిగింపు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయ్యింది. పోలీసు బలగాల అండతో అధికారులు కూరగాయల మార్కెట్‌ను తొలగించారు. 2014 నుంచి ఈ మార్కెట్ తొలగింపు వ్యవహారం నలుగుతూనే ఉంది. కొత్త మార్కెట్ నిర్మించాలనుకోవడంతో వ్యాపారులను స్థలాలు ఖాళీ చేయమని కమిషనర్ ఆదేశించారు. వ్యతిరేకించిన వ్యాపారస్తులు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. కోర్టు స్టే ఎత్తివేయడంతో మున్సిపల్ అధికారులు తొలగింపు కార్యక్రమానికి పూనుకున్నారు. వ్యాపారస్తులతో పాటు వైకాపా నాయుకులు సైతం తొలగింపు ప్రక్రియకు అడ్డుపడుతూ వచ్చారు. కమిషనర్ ఆదేశాల ప్రకారం శనివారం ఉదయం పోలీసు బలగాలను భారీగా మోహరింప చేసి ప్రొక్లెయిన్లతో మార్కెట్‌ను తొలగించారు. వైకాపా నేతలు ప్లీనరీ సమావేశాలకు వెళ్లారని తెలుసుకుని హుటాహుటిన తొలగింపు కార్యక్రమం చేపట్టారని వైకాపా నాయకులు మండిపడుతున్నారు. తొలగింపు జరుగుతున్నప్పుడు అడ్డుకునేందుకు వచ్చిన స్థానిక వైకాపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

No comments: