రవికిరణాలు(ప్రహల్య-డెస్క్): ఎన్టీఆర్.. నందమూరి తారక రామారావు. వెండితెరపై తన నట విశ్వరూపంతో విశ్వ విఖ్యాత నట సార్వభౌమిడిగా బిరుదు పొంది.. తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం పొందారు. ఇటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి ప్రజల ఆరాధ్య దేవుడయ్యాడు. పదవిలో ఉన్నది కొంత కాలమే అయినా.. ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రిగా... తన వాక్చాతుర్యంతో జై ఎన్టీఆర్ అనిపించుకున్నారు. తరాలు మారినా ఆ నందమూరి తారకరామారావును జనం మరువలేరు. ఆయన మరపురారు.
తమ్ముళ్లూ.. ఆడపడుచులూ అంటూ ఎన్టీఆర్ చెసిన ప్రసంగాలు ఇప్పటికీ తెలుగు ప్రజలు గుండెల్లో మారుమోగుతునే ఉన్నాయి. ఆయన వారసుడి గురించి ఆలోచించే లోపే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి, తెదేపా అధ్యక్ష పదవిని చేతబట్టారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు పార్టీని లీడ్ చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ కొడుకులను పక్కన పెట్టి ఆయనే పార్టీని సొంతం చేసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు వారసుడెవరన్న చర్చ జనాల్లో మళ్లీ మొదలైంది. నందమూరి తారకరామారావు పోలికలతో పాటు వాక్చాతుర్యం పునికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు ముద్దు బిడ్డ లోకేష్. వీరిద్దరిలో ఎవరు తాతకు తగ్గ మనవడు అనేది చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న. చంద్రబాబు అభిమానులు లోకేష్ బాబు అంటుంటే.. పార్టీ అభిమానులు , ఎన్టీఆర్ అభిమానులు మాత్రం జూనియర్‌కే జై కోడుతున్నట్లు తెలుస్తుంది.
రాజకీయ నాయకుడికి ప్రజల్ని ఆకట్టుకునే వాక్చాతుర్యం చాలా ప్రధాన లక్షణం. అందులో జూ. ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అని ఎప్పుడో నిరూపించుకున్నారు. ఈ మధ్యనే రాజకీయ అరంగ్రేట్రం చేసిన లోకేష్ బాబు మాత్రం ఎక్కడికక్కడ తడబడుతూ ఉపాన్యాసాలు కొనసాగిస్తున్నారు. లోకేష్ ప్రసంగాలు చూసి తాతలా కాదు కనీసం నాన్నలా కూడా మాట్లాడలేకపోతున్నారని జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తర్వాత పార్టీని లీడ్ చేసేది ఎవరన్నదానిపై జనంలో కూడా అనుమానం మొదలైంది. సీనియర్ ఎన్టీర్‌కు జూనియర్ కరెక్ట్ మ్యాచా లేక లోకేషా అన్న దానిపై కూడా పెద్ద చర్చే జరుగుతుంది. రాజకీయంగా ఏం జరిగినా వెండి తెరపై మాత్రం ఈ సింగమళై ఆ విశ్వవిఖ్యాత నటసార్వభౌమిడికి వారసుడనిపించుకుంటున్నాడు.
https://www.youtube.com/watch?v=sRu0K4ypEJc
No comments: