రవికిరణాలు(నెల్లూరు - కార్పొరేషన్) : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా మారింది నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారం. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రికి చెందిన నెల్లూరులోనే కార్పొరేషన్‌కు వైద్యాధికారి లేకుండా పోయారు. నాలుగు నెలలుగా హెల్తఆఫీసర్ లేకపోయినా పట్టించుకునే దిక్కు లేదు. అసులెందుకీ జాప్యం..? కార్పొరేషన్‌పై మంత్రికి చిన్నచూపా...? లేక అనుకూలంగా ఉన్నవారి కోసం వెయిటింగ్‌లో పెట్టారా అనేది ఆయనకే తెలియాలి. చెప్పుకోడానికి జిల్లాకు చెందిన వారు కేబినేట్‌లో ఇద్దరున్నారు. ఒకరు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి, మరొకరి పురపాలక శాఖ మంత్రి నారాయణ. ఒక పక్క వర్షాలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. వెంటకేశ్వరపురంలో ఓ బాలిక డెంగ్యూ బారిన పడి మృతి చెందిందని వార్తలు కూడా బయటకు వచ్చాయి. నగర మేయర్ అది డెంగ్యూ కాదు.. ఇంకా వ్యాధి నిర్థరణ కాలేదు అని వెల్లడించారు. మరి ఆ వ్యాధిని నిర్థరించాల్సిన వ్యక్తి హెల్త్‌ఆఫీసర్. మరి అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి హెల్త్‌ఆఫీసర్ పోస్టు ఇంకా భర్తీ చేయకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారు..? ఇంత జరుగుతున్నా ఆ ఇద్దరు అమాత్యులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారో తెలియడం లేదు. మొక్కల పెంపకంపై ఉన్న శ్రద్ధ హెల్త్ ఆఫీసర్‌ను నియమించడంపైన కూడా ఉండాలని ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అయినా అధికార పక్షంలో చలనం లేదు. ఇప్పటికైనా కార్పొరేషన్ పాలకులు ఒకరిపై ఒకరు విమర్శల పేరిట బురదజల్లుకోవడం మానుకుని సత్వరమే కార్పొరేషన్‌కు హెల్త్‌ఆఫీసర్‌ను నియమించకపోతే... రాబోయే సీజనల్ వ్యాధులు విజృంభించడంతో పాటు సూపరవైజర్‌లేని శానిటరీ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది.
కార్పొరేషన్ కు డాక్టరు కావలెను
కార్పొరేషన్ కు డాక్టరు కావలెను
Reviewed by CHANDRA BABU
on
July 22, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు - కార్పొరేషన్) : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా మారింది నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారం. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రికి చె...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: