రవికిరణాలు(తిరుపతి-సెల్వం): చిత్తూర్ జిల్లాలో హెరిటేజ్ వ్యాన్‌లో ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయి. హెరిటేజ్ పాల ప్యాకెట్లు తరలించే వ్యాను ఎర్రబంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. తిరుపతి సత్యనారాయణపురం బీడీ కాలనీ అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల కూంబింగ్ నిర్వహించారు. ఎర్రచందనం దొంగలను పట్టుకునేందుకు కూంబింగ్ నిర్వహించిన పోలీసులకు 50మంది కూలీలు తారసపడ్డారు. తప్పించుకునేందుకు కూలీలు పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పుల జరపగా... భయపడిన కూలీలు వాహనాలను వదిలి పరారయ్యారు. ఎర్రచందనం తరలిస్తున్న AP26TC4187 వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. వాహనంతో పాటు 71 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే సహించనంటూ కన్నెర్ర చేసిన ముఖ్యమంత్రి సొంత కంపెనీ అయిన హెరిటేజ్ సంస్థకు చెందిన వ్యాన్‌లో ఈ దుంగలు దొరకడం గమనార్హం.
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: