రవికిరణాలు(వనిత): గోరింటాకు జుట్టుకు చాలా మంచిందని అందరికీ తెలుసు. అందుకే హెన్నా పౌడర్ల వెంట పడుతున్నారు. కానీ రసాయనాలతో కూడిన ఆ హెన్నా పౌడర్ కన్నా వాకిట్లో కనిపించే గోరింటాకే ఎంతో మంచిది. తెల్ల జుట్టును నివారించేందుకు గోరింటాకు చక్కటి ఔషదం. గోరింటాకుకు ఉసిరిపోడిని జత చేస్తే జుట్టు మరింత దట్టంగా పెరుగుంది. ఒత్తైన నల్లని జుట్టు కావాలంటే ఈ కింద పేర్కొన్న విధానాన్ని ఓ సారి ట్రై చేయండి....
*తాజా గోరింటాకును తీసుకుని మెత్తగా పేస్టు చేసుకోవాలి. రెండు స్పూన్ల గోరింటాకు పేస్టులో ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని తీసుకొని దానికి కాస్త కాఫీ పొడి, తగిన మోతాదులో నీటిని కలిపి పేస్టులా తయారుచేయాలి. ఆ పేస్టును తలకి పట్టించి 2గంటల పాటు అలానే ఉంచాలి. తర్వాత ఘాడత తక్కువగా ఉన్న
షాంపుతో తలస్నానం చేయాలి. నెలకు రెండు సార్లు ఇలా చేస్తే రెండు నెలల్లో తేడా మీకే తెలుస్తుంది. టేబుల్ స్పూన్స్ తాజా గోరింటాకు పేస్టు, 1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని తీసుకొని దానిలోకి కాఫీ పొడి, తగిన మోతాదులో నీటిని కలిపి పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని తలకి అప్లైచేసి 2 గంటలు అలానే ఉంచి ఏదైనా షాంపూతో తలని శుభ్రం చేయాలి.
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: