[gallery td_select_gallery_slide="slide" ids="1394,1393,1392,1391,1390,1389,1388"]
రవికిరణాలు(తిరుమల - సెల్వం) : తిరుమలలో అణివారి ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది. సాధారణంగా ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు జరుగుతుంది. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున అంటే జూలై 16వ తేదిన జరిగే కొలువు కనుక ఈ ఉత్సవానికి ఆణివార ఆస్థానం అని పేరు వచ్చింది. ఈ సందర్భంగా టీటీడీ ఆదివారం శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసింది. సాయంత్రం ఆలయంలో కైంకర్యాలను ముగించుకొని మంగళ వాయిద్యాలు, కోలాటాలు, మంగళ హారుతుల నడుమ పుష్ప పల్లకిని శ్రీదేవి ,భూదేవి సమేత మలయప్ప స్వామి పల్లకీ ని అవరోధించి భక్తులకు కనువిందు చేశారు. ముఖ్యంగా పల్లకీపై మాహాద్వారం వైపు అలంకరించిన మత్స్య, కూర్మ, వరాహ ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మరో పక్క ఉభయ దేవేరులతో వేంచేస్తున్న పుష్పపల్లకి పరిమలం వేదచల్లడంతో భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ తన్మయత్వానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

No comments: