రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు జిల్లాలో కాలుష్యాన్ని వెదజల్లతూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్ చేసారు. ముత్తుకూరు మండలం పైనాపురం, తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి, మండపం గ్రామాల మధ్యలో ఉన్న సెంబ్ కార్బ్, గాయత్రీ పవర్ కాంప్లెక్స్ వద్ద కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని మండిపడ్డారు. కంపెనీలనుంచి వచ్చే కాలుష్యం వల్ల ప్రజలు ఆనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరెండు కంపెనీలు కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులతో కలసి ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. వెంటనే అధికారులు స్పందించి కాలుష్య నివారణకు చర్యలు తీసుకునేలా యాజమాన్యాలపై వత్తిడి తెవాలని కోరారు. కాలుష్యం వల్ల రోగాల బారిన పడిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో తిరుపతి పార్లమెంట్ సభ్యుడు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="1671,1670,1669"]
[gallery td_select_gallery_slide="slide" ids="1671,1670,1669"]
No comments: