రవికిరణాలు(ప్రహల్య): గురుపౌర్ణమి అనగానే సాయిబాబాకు ప్రీతిపాత్రమైన రోజు అని అంతా భావిస్తారు. అందుకే ఆ రోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. కానీ ఈ రోజు బాబాను దేవుడిగా పూజించే రోజు కాదు. గురువుగా ప్రార్థించే రోజు. సాయిబాబా స్వయంగా తన భక్తులకు తాను దేవుడిని కాదు.. గురువును అంటూ సెలవిచ్చిన రోజు. అసలు ఈ రోజు గురుపూర్ణిమ అని పిలిచేందుకు ఓ విశిష్టత ఉంది. చాలా మంది గురుపూర్ణిమ అంటే సాయిబాబా పుట్టినరోజు అనుకుంటారు. కానీ గురుపూర్ణిమ వేదవ్యాసుడి పుట్టిరోజు కాబట్టి జరుపుకుంటారు. మానవాళికి వేదాలు అందించిన వ్యాసమహర్షిని ఆయన పుట్టిన రోజు నాడు పూజించే రోజు కాబట్టే దీనిని గురుపూర్ణిమ అంటారు. వ్యాసుడికి సంబంధించిన గురుపూర్ణిమ సాయినాధుడికి ఎలా ప్రత్యేకమైన రోజుగా మారిందో తెలుసుకుందాం పదండి.
గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజున చాలా మంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.
సాయిబాబు బ్రతికి ఉన్న రోజుల్లో 1906వ సంవత్సరంలో ఆషాడమాసంలో వ్యాసపూర్ణిమ వచ్చింది. ఆ రోజు సాయిబాబా తన భక్తుల్లో ఒకడైన కేల్కర్‌ను పిలిచి.. ఈ రోజు గురువుల పండుగ. గురువును పూజించాలి... పూజా సామాగ్రితో పాటు భక్తులందరినీ పిలుచుకుని రా అని చెబుతారు. కేల్కర్ సహా భక్తులందరూ పూజా సామాగ్రితో బాబా వద్దకు వస్తారు. బాబాను అతీతశక్తులు కలిగిన భగవంతుడిగానే అప్పటివరకు భక్తులు భావించేవారు. పూజా సామాగ్రితో వచ్చిన భక్తులు.. ఇప్పుడు ఏ గురువును పూజించాలా అనే ఆలోచనలో మిన్నకుండిపోయారు. అప్పటి వరకు ధ్యానంలో ఉన్న బాబా కళ్లు తెరచి... మీరంతా నన్ను దేవుడిగా భావిస్తున్నారు. కానీ నేను దేవుడికి సేవకుడి మాత్రమే అని చెప్పారు. మీరంతా నా బిడ్డలు... నా నుంచి మీకు మంచి జరగాలి. మిమ్మల్ని సక్రమమైన మార్గంలో నడిపేందుకే నేను ఈ ప్రపంచంలోకి వచ్చాను. మీరు నన్ను దేవుడిలా భావించి.. గోడకు నా ఫోటో తగిలించి పూజలు చేస్తే ఫలితం ఉండదు. మీరు నన్ను గురువుగా భావించి.. నేనే చెప్పే ప్రతి విషయాన్ని ఆచరించాలి. ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో వచ్చే వ్యాసపూర్ణిమ నాడు నన్ను గురువుగా పూజించి మంచి మార్గంలో నడవమంటూ బాబా భక్తులకు సెలవిచ్చారట. అందుకని ఆ నాటి నుంచి వ్యాసపూర్ణిమను గురుపూర్ణిమగా సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.
వ్యాసుడి పుట్టిన రోజే వ్యాసపూర్ణిమ.. అదే గురుపౌర్ణమి

నన్ను సద్గురువుగా కొలవమని బాబా కోరిన రోజు గురుపౌర్ణమి

No comments: