[gallery td_select_gallery_slide="slide" ids="912,910,909,911"]
రవికిరణాలు(అనంతపురం):అనంతపురం పోలీసు శిక్షణా కళాశాలలో పోలీసుల ఇండక్ష్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర పోలీసు శాఖలోని సివిల్ & కమ్యూనికేషన్స్ విభాగాలకు ఎంపికైన స్టైఫండరీ కేడెట్ ట్రైనీ ఎస్.ఐలు, ఫింగర్ ప్రింట్స్ విభాగానికి ఎంపికైన స్టైఫండరీ కేడెట్ ట్రైనీ ఏ.ఎస్.ఐల ట్రైనింగ్ కార్యక్రమాన్నిడి.జి.పి నండూరి సాంబశివరావు ప్రారంభించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న డి.జి.పి. కార్యక్రమ ప్రారంభోత్సవ అనంతరం ట్రైనీలనుద్ధేశించి ప్రసంగించారు.ప్రస్తుత సమాజం పోకడ, శిక్షణా కాలంలో నేర్చుకోవాల్సిన చట్టాలు, మెళకువలు, ప్రవర్తన, ప్రజలతో మమేకమై అందించాల్సిన సేవలు, తదితర అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించి ట్రైనీలకు దిశానిర్ధేశం చేశారు.అనంతరం ప్రతీ ట్రైనీకు ల్యాప్ టాప్ అందజేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ట్రైనింగ్ విభాగం ఐ.జి.పి.లు ఎన్ సంజయ్, రవిచంద్ర, రాయలసీమ రీజియన్ ఐ.జి.పి. షేక్ మహమ్మద్ ఇక్బాల్ ,కర్నూలు రేంజ్ డి.ఐ.జి. జి.శ్రీనివాస్ ,పి.టి.సి. ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
No comments: